సరికొత్త టాటా సుమో గ్రాండ్-MKll విడుదల

తాజాగా ఈ కారులోని లోపాలను సవరించి, దీనికి సరికొత్త ఫీచర్స్ ను జతచేర్చి ఈ సుమో గ్రాండ్ సరికొత్త వెర్షన్ గా సుమో గ్రాండ్ MKll ను విడుదల చేసింది టాటా మోటార్స్. సుమో గ్రాండ్ లో లోపించిన ఫీచర్స్ ను జతచేర్చి ఈ సరికొత్త కారును రూపొందించినట్టు టాటా మోటార్స్ ఇంజనీర్లు ప్రకటించారు. ఇక కారు మోడల్ విషయానికి వస్తే ఈ కారు సుమో గ్రాండ్ మోడల్ నే పోలి వుంది.
ఇక ఈ కారుకు 2.2 లీటర్ డైకోర్ డీజల్ యూనిట్ జతచేయబడింది. అలాగే ఇంజన్ సామర్థ్యాన్ని కూడా పెంచారు. ఈ సరికొత్త సుమో గ్రాండ్ ఇంజన్ 120ps పవర్, 250nm టార్క్ తో రూపొందింది. వీటితో పాటు ఈ సుమో గ్రాండ్ కు సరికొత్త అల్లాయ్ టైర్లు, మ్యూజిక్ సిస్టమ్ విత్ ఐ-పాడ్ కనెక్టివ్ అధనపు ఆకర్షణ. కాగా ఈ కారు ఎక్స్-షోరూం ధర ఢిల్లీ లో 6.43 లక్షలుగా నిర్ణయించారు. సరికొత్త ఫీచర్స్ తో రూపొందిన ఈ కొత్త సుమో గ్రాండ్ MKll తప్పకుండా జనాధరణ పొందుతుందనే విశ్వాసాన్ని టాటా మోటార్స్ వ్యక్తం చేసింది.


Click it and Unblock the Notifications








