ఎప్పుడూ మధ్య తరగతి కుంటుంబాలకు ఉపయోగకరంగా వుండే వాహనాలను రూపొందించడంలో ముందుండే టాటా మోటార్స్ తాజాగా గ్రామీణ ప్రాంతాల్లో వుండే వారికి ఉపయోగకరంగా వుండే వాహన్నాన్ని విడుదల చేసింది. టాటా మ్యాజిక్ పేరుతో విడుదలైన ఈ వాహనం సక్సెస్ ఫుల్ 'ఏస్' (ace) వాహనాన్ని పోలి వుంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల రవాణాకు చాలా సౌకర్యవంతంగా వుండేలా ఈ వాహనాన్ని డిజైన్ చేసారు. నాలుగురి నుండీ ఏడుగురు సౌకర్యవంతంగా కూర్చునేందుకు వీలుగా ఈ వాహనాన్ని డిజైన్ చేసారు. 2.60 లక్షలుగా దీని ధరను నిర్ణయించారు.
అలాగే టాటా వింజర్ పేరిట ఓ వ్యాన్ కూడా విడుదలచేసారు. తొమ్మిది మంది నుండీ 13 మంది సౌకర్యవంతంగా కూర్చునేందుకు వీలుగా వున్న ఈ వాహనం ఎయిర్ పోర్ట్ ట్రాన్స్ పోర్ట్ కు, ఆంబులెన్స్ గా, టూరిస్టు వాహనంగా, స్కూల్ బస్ గా చాలా సౌరక్యవంతంగా వుంటుంది. దీని ధర 4.70 లక్షలుగా నిర్ణయించారు.