భారతీయ ఆటోమొబైల్ ధిగ్గజం టాటా మోటార్స్ దినదినాభివృద్ధి చెందుతూ తన పరిదిని విస్తరించుకొంటోంది. ఈ విషయాన్ని స్వయంగా టాటా మోటార్స్ చెర్మైన్ రతన్ టాటా స్పష్టం చేసాడు. దక్షిణ కొరియాకు చెందిన ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో ఆయనీ విషయాన్ని తెలిపారు. త్వరలో టాటా మోటార్స్ తమ చిన్న కారు నానోకు హైబ్రిడ్ వెర్షన్ కారుని విడుదల చెయ్యనుట్టు ఆయన తెలిపారు. టాటా అభిప్రాయం ప్రకారం భారతీయ వినియోగదారులు చౌక ధర గల వస్తువులకే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారట. అందుకే తమ చిన్న 'లక్ష'ణమయిన కారుకి అంత పెద్ద ఎత్తున ఆదరణ లభించిందని ఆయన మురిసిపోతున్నాడు.
కాగా టాటా మోటార్స్ వారి చిన్న సైజు ట్రక్కు టాటా ఏస్ ను కూడా దక్షిణ కొరియాలో లాంచ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నట్టు, వీలయితే ఆదరణను బట్టి అక్కడే ఈ ట్రక్కులను రూపొందించే ప్లాంట్ ను ఏర్పాటు చెయ్యాలనుకుంటున్నట్టు కూడా తెలిపారు. ఆటోమొబైల్ రంగంలోనే కాకుండా టాటా కంపెనీ దక్షిణ అమెరికాలోని బ్రెజిల్, అర్జెంటీనా వంటి దేశాల్లో సాఫ్ట్ వేర్, హోటల్, బయో ఇంధనం వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టనున్నట్టు కూడా రతన్ టాటా వెళ్లడించారు....!!