'నానో యురోపా' కు రంగం సిద్ధం..!!

By

Tata Nano
భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ప్రపంచంలోనే అతి చవకయిన కారు టాటా నానో ను ఈ ఏడాది ప్రథమార్థంలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ భారతీయ నానో మోడల్ తో పాటుగా నానో యూరోపియన్ మోడల్ నానో యూరోపాను కూడా రివీల్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత యూరోపియన్ యూనియన్ ప్రమాణాల ను అందుకొనేందుకు అన్ని పరీక్షలు పూర్తి చేసుకున్న ఈ కారు త్వరలోనే ప్రొడక్షన్ కు వెళ్లనుంది.

భారతీయ నానో కన్నా ఈ యూరోపియన్ మోడల్ లో అధనపు సౌకర్యాలతో పాటు, దీని ధర కూడా భారతీయ నానో కన్నా రెట్టింపుగా పలకనుందని సమాచారం. ఈ యురోపియన్ మోడల్ కారులో 4-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ కు బదులుగా 5-స్పీడ్ ట్రాన్స్ మిషన్ ను అమర్చారు. ఇంధనం వాడుకలో మంచి మన్నికను అందించే ఈ కారుకు యాంటీ బ్రేక్ సిస్టమ్ ప్రధాన ఆకర్షణ.

అంతే కాకుండా భారతీయ నానో కారు కన్నా ఈ మోడల్ కారు చాలా లగ్జరీగా కనిపిస్తుందని తెలిసింది. భద్రత విషయంలో కూడా ఏమాత్రం రాజీపడని ఈ కారు యూరోపియనో భద్రతా ప్రమాణాలను అందుకునేదిగా రూపొందిందట. కాగా ఈ కారు 2011లో మార్కెట్ లోకి రానుంది. దీనితో పాటుగా త్వరలోనే హైబ్రిడ్ నానో కారుని కూడా రూపొందించనున్నట్టు టాటా మోటార్స్ అధినేత రతన్ టాటా ప్రకటించారు.

More from DriveSpark

Article Published On: Friday, December 11, 2009, 12:30 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+