నానోకు పోటీగా మరో 'లక్ష'ణమయిన కారు..!!

By

Tata Nano
భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ రూపొందించిన నానో కారు ఇప్పటికే భారతీయ రోడ్ల మీద పరుగులు తీస్తూ, 'లక్ష'ణమయిన కారుగా పేరు తెచ్చుకొంది. దీనికి తోడు ఈ లక్ష కారుకి పోటీ ఇవ్వడానికి ఏ కంపెనీ కూడా సాహసించకపోవడంతో మధ్యతరగతి కారుగా తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. ఈ కారును బుక్ చేసుకున్నవారికి వచ్చే ఏడాదిలోపు కూడా కారు దక్కని పరిస్థితి నెలకొంది అంటే ఈ కారుకి లభిస్తున్న ఆదరణ ఎంతో అర్థం చేసుకోవచ్చు.

కానీ త్వరలో ఈ కారుకి పోటీగా మరో కారు రానుంది. లండన్ కు చెందిన ఆటోమొబైల్ కంపెనీ ఎకోకా(EcoCa) మోటార్స్ త్వరలోనే 340 సిసి ఇంజన్ తో ఓ టూ-సీటర్ కారుని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ కారు ధర 2,200 డాలర్లు(లక్ష రూపాయలు) గా నిర్ణయించారు. దీనికోసం ఇండియాకు చెందిన ఓ ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీతో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోందని కంపెనీ వర్గాలు ప్రకటించాయి. కానీ చర్చలు జరిపిన ఆ ఆటోమొబైల్ కంపెనీ పేరును వెళ్లడించేందుక వారు నిరాకరించారు. కానీ మహీంద్రా & మహీంద్రా కంపెనీతో ఒప్పందానికై ప్రయత్నిస్తున్నట్టు విశ్వసనీయవర్గాల కథనం.

More from DriveSpark

Article Published On: Monday, November 30, 2009, 12:22 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+