భారతీయ రోడ్ల పై టయోటా 'అవాంజా' హల్ చల్

అంతే కాదు ప్రస్తుతం భారతీయ మార్కెట్ లో కేవలం 3% షేర్ వున్న టయోటా మోటార్స్ తన షేర్ ను పెంచుకొనేందుకు, భారతీయ ఆటోమొబైల్ మార్కెట్ ఏలుతున్న టాటా మోటార్స్, మారుతి సుజికి లకు గట్టి పోటీని ఇచ్చేందుకు ఓ చిన్న కారుని కూడా మన దేశ మార్కెట్ లోకి విడుదల చెయ్యనుందట. 2011 వ సంవత్సరం నాటికి ఈ చిన్న కారు మన ముందుకు రానుందని కంపెనీ ఓ ప్రకటనలో వెళ్లడించింది. టోక్యో మోటర్ షోలో మాట్లాడిన టయోయా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ యుకితోషి పునో "టయోటాను భారతీయ మార్కెట్ లో మరింత ముందుకు తీసుకుపోయేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు, దీనికి కొంత సమయం పట్టవచ్చని, కానీ దీర్ఘకాలిక ప్రణాళికతో తాము ముందుకు పోతున్నట్టు" తెలిపారు.


Click it and Unblock the Notifications








