హైబ్రిడ్ కార్ల అభివృద్ధిపై దృష్టి సారించిన టయోటా

2010లో జరగనున్న ఉత్తర అమెరికా అంతర్జాతీయ ఆటో షోలో టొయోటా ఈ హైబ్రిడ్ కాన్సెప్ట్ కారును ప్రదర్శించనుంది. ఈ కాన్సెప్ట్ కారును బహుళజనాదరణ పొందిన ప్రయస్ కారును స్ఫూర్తిగా తీసుకొని రూపొందించింది.
ఈ వాహనాన్ని జనవరి 11, 2010 సోమవారం జరిగే న్యూస్ కాన్ఫరెన్స్‌లో ఆవిష్కరించనున్నారు. వచ్చే ఏడాది 2010 లో విడుదల కానున్న టయోటా ప్రియుస్ ప్లగ్ ఇన్ హైబ్రిడ్ వెహికల్‌ను కంపెనీ ఇటీవలే జరిగిన లాస్ ఏంజిల్స్ ఆటో షో లో ప్రదర్శించిన సంగతి తెలిసిందే. మిగితా ఆటోమొబైల్ కంపెనీల లాగానే టయోటా మోటార్స్ కూడా ప్లగ్ ఇన్ ఎలక్ట్రిక్ కార్లును రూపొందించడానికి ఆశక్తి చూపుతోంది.


Click it and Unblock the Notifications








