జపాన్ కు చెందిన ఆటోమొబైల్ కంపెనీ టయోటా మోటార్స్ భారీ వాహనాలకు మంచి పేరొందిన విషయం తెలిసిందే. ఇన్నోవా, క్వాలిస్ వంటి బహుళజనాధరణ గల వాహనాలను రూపొందించిన టయోటా తాజాగా విడుదల చేసిన కారు ఫార్ట్యూనర్ కు మంచి ఆదరణ లభిస్తోంది. ఆగస్ట్ 24, 2009 న ఈ కారు విడుదలయినప్పటి నుండీ అడ్వాన్స్ బుకింగులు ఊపందుకున్నాయట. దీంతో ఉత్పత్తికి మించి ఆడర్లు రావడంతో సదురు కంపెనీ చేసేది లేక ఉత్పత్తిని పెంచనున్నట్టు తెలిపింది. తొలుత నెలకు 500 యూనిట్ల ను ఉత్పత్తి చెయ్యాలనుకున్నట్టు అనుకున్నా, వస్తోన్న డిమాండ్ బట్టి ఉత్వత్తిని పెంచినట్టు కంపెనీ వర్గాలు ప్రకటించాయి.
ఇటీవల జరిగిన టోక్యో మోటార్ షో లో టయోటా మోటార్స్ మ్యానేజింగ్ డైరెక్టర్ సందీప్ సింగ్ మాట్లాడుతూ "ఫార్ట్యూనర్ కు అన్ని వర్గాల నుండీ మంచి స్పందన లభిస్తోందని, జనవరి, 2010 నుండీ ఈ కార్ల ఉత్పత్తిని నెలకు 500 నుండీ 800 కు పెంచనున్నట్టు" తెలిపారు. మీరు కూడా ఈ కారును సొంతం చేసుకోవాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం ఈ కారును వెంటనే ఆర్డర్ చెయ్యండి, దీని ధర కేవలం 18.45 లక్షలు మాత్రమే..