భారతీయ మార్కెట్ లోకి మరో 'చిన్న' కారు

ఈ సంద్భంగా టయోటా మోటార్స్ మ్యానేజింగ్ డైరెక్టర్ సందీప్ సింగ్ మాట్లాడుతూ జనవరిలో న్యూ ఢిల్లీలో జరగనున్న ఆటో షో లో ఈ కారుని విడుదల చెయ్యనున్నట్టు ప్రకటించారు. జనవరి 5, 2010లో ఈ ఆటో షో మొదలుకానుంది. ఈ కారు విడుదల భారతీయ ఆటోమొబైల్ మార్కెట్ ను శాశిస్తున్న మారుతి సుజికి, టాటా మోటార్స్, హుందాయ్ మోటార్స్ వంటి కంపెనీల మీద ప్రభావం చూపుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతే కాకుండా ఈ కారు ఖచ్చితంగా టయోటా మోటార్స్ ను భారతీయ మార్కెట్ లో స్థిరపడేలా చేస్తుందని కంపెనీ వర్గాలు ఆశాభావాన్ని వ్యక్తంచేసారు. కాగా ఈ కార్లను బెంగుళూరు సమీపంలోని యూనిట్ లో రూపొందిస్తున్నట్టు కంపెనీ వర్గాలు ప్రకటించాయి.


Click it and Unblock the Notifications








