భారతీయ విపణిలోకి టయోటా వారి సరికొత్త ప్రాడో...!!

2004 వ సంవత్సరం లో విడుదలయిన ఈ ప్రాడో SUV ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకూ 1.56 మిలియన్ కార్ల అమ్మకాలు జరిగాయని, ఈ సరికొత్త డీజిలో వెర్షన్ తో భారతీయ SUV విభాగంలో 10% మార్కెట్ వాటాను దక్కించుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు మేనేజింగ్ డైరెక్టర్ నగకవ తెలిపారు.
3.0 లీటర్ల డీజిల్ ఇంజన్, హైవేలు, నగరాల్లో సంతృప్తికరమైన డ్రైవింగ్ కోసం కైనెటిక్ డైనమిక్ సస్పెన్షన్ వ్యవస్థ, 3 జోన్ ఆటోమేటిక్ క్లైమెట్ కంట్రోల్, మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే, డౌన్ హిల్ అసిస్ట్ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, వైట్ పెరల్ క్రిస్టల్ షైన్ వంటి అధనపు ఫీచర్స్ తో ఈ కారు విడుదలవుతోంది. ఇదిలా వుంటే వైట్ పర్ల్ క్రిస్టల్ షైన్, సిల్వర్ మెటాలిక్, గ్రే మెటాలిక్, గ్రేయిష్ బ్లూ మెటాలిక్, బ్లాక్ వంటి ఐదు రంగుల్లో ఈ కారు లభ్యం కానుంది.


Click it and Unblock the Notifications








