భారతీయ విపణిలో పాగా వెయ్యడానికి వోక్స్ వ్యాగన్ సిద్ధం...!!

ఇటీవలే వోక్స్ వ్యాగన్ బహుళజనాధరణ పొందిన తమ బ్రాండ్ కారు బీటెల్ ను భారతీయ మార్కెట్ లోకి ప్రవేశపెట్టింది. ఆ తర్వాత ఇక్కడి ఆటోమొబైల్ కంపెనీ సుజుకి కార్పొరేషన్ తో ఒప్పందాన్ని కుదుర్చుకొని త్వరలో భారతీయ మార్కెట్ కు సరిపోయేలా ఓ చిన్న కారుని విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ కారు ధర 2 నుండీ 2.5 లక్షల మధ్య వుండవచ్చని కంపెనీ ప్రకటించింది. వచ్చే ఐదేళ్లలో భారతీయ మార్కెట్ లో 8% నుండీ 10% మార్కెట్ ను ఆక్రమించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్టు కంపెనీ ప్రకటించింది.
దీంతో పాటు వోక్స్ వ్యాగన్ త్వరలో స్కోడా, ఆడీ కార్ల అమ్మకానికై సుమారు 200 మంది డీలర్ల కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. అంతే కాదు ఇతర దేశాల్లో జనాదరణ పొందిన తమ బ్రాండ్ కార్లను భారతీయ మార్కెట్ లోకి విడుదల చెయ్యడానికి కూడా సన్నాహాలు చేస్తోంది. తప్పకుండా భారతీయ మార్కెట్ లో పాగా వెయ్యగలమనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications








