జర్మనీకి చెందిన ఆటోమొబైల్ కంపెనీ వోక్స్ వ్యాగన్ తమ సంస్థ నుండీ బహుళజనాధరణ పొందిన కారు బీటల్ ను భారతీయ మార్కెట్ లోకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది డిసెంబరు నెలలోనే ఈ కారును ఇక్కడి మార్కెట్ లో విడుదల చెయ్యనుందని కంపెనీ వర్గాలు ప్రకటించాయి. మెక్సికో లోని వోక్స్ వ్యాగన్ ప్లాంట్ నుండీ ఈ కార్లను భారతదేశానికి దిగుమతి అవుతాయని కంపెనీకి చెందిన ఓ సీనియర్ అధికారి ప్రకటించారు. దాంతో ఇప్పుడు ఈ కారుకు ప్రచారం కల్పించే పనుల్లో కంపెనీ వర్గాలు బిజీ-బిజీ గా వున్నాయి.
ఇక ఈ బీటల్ కారు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణపొందింది. ఈ కారు విడుదలయినప్పుడు వచ్చిన ప్రతికూల ప్రకటనలను పటాపంచలు చేస్తూ ఈ కారు బహుళజనాధరణ పొందింది. దీంతో ఈ కారును భారతీయమార్కెట్ లోకి విడుదల చెయ్యడానికి కంపెనీ రంగం సిద్ధం చేసుకొంది. కానీ ఈ కారు ధరను ఇంకా ప్రకటించలేదు. ఎంత ధర వుంటుందోనన్న ప్రశ్నకు కూడా కంపెనీ వారు సమాధానం దాటవేశారు. కాగా యుయస్ లో ఈ కారు ధర $25,990 గా వుంది.