డెట్రాయిట్ లో జరుగుతున్న ఆటో షోలో అద్భుతం ఆవిష్కుతమయింది. రెక్కల విహంగం లాంటి బెంజ్ కారును మెర్సిడిస్ సంస్థ ఈ షోలో ప్రదర్శనకు వుంచింది. పరుచుకున్న రెక్కల్లాగా వున్న ఈ కారు డోర్లు అందయిన బాడీ వీక్షకులను విశేషంగా ఆకర్షిస్తోంది. మెర్సిడిస్ ఎస్ఎల్ఎస్ ఎయంజి జిటి3 రేసర్ పేరుతే విడుదలయిన ఈ కారు స్పోర్ట్ కార్ లుక్ తో సూపర్బ్ గా వుంది.
6.3L ఇంజన్ తో రూపొందిన ఈ కారు 600 హార్స్ పవర్ తో దూసుకుపోనుంది. సాధారణ కార్ల కంటే బరువు చాలా తక్కువ వుండటంతో ఈ కారు అత్యధిక వేగంతో దూసుకుపోగలదు. ఇంకా ధర నిర్ణయించని ఈ రేస్ కారు 2011 వ సంవత్సర మాధ్యమంలో విడుదల కానుంది.