ప్రోడక్షన్ మళ్శీ మొదలైంది అంటున్న అపోలో టైర్స్ ...!

Apollo Tyres
అపోలో టైర్స్ ఇండియాలో కూడా తమకంటూ ప్రత్యేక సంపాదించుకున్నారు. ఇటీనల కాలంలో కేరళ ఉన్న పేరంబ్రా ప్యాక్టరీలో వర్కర్స్ వారి యొక్క సమస్యల గురించి స్ట్రైక్ చేయడం తేలిసిందే. ఈ స్ట్రైక్ జూన్ 11న మొదలై ఆగస్టు 21 వరకు జరిగినది. చివరకు దిగివచ్చిన యాజమాన్యం వర్కర్స్ సమస్యలను పరిష్కరించింది. ఈ అగ్రిమెంట్ ప్రకారం అపోలో టైర్స్ కోత్తగా 200 మందిని మరియు నెల వారీ జీతం రూ 5,250 పెంచుతున్నట్లు అపోలో టైర్స్ ఛీఫ్ సతీష్ శర్మ(ఇండియా ఆపరేషన్స్) వివరించారు. అంతేకాకుండా ప్రస్తుతం కంపెని కెపాసిటీ రోజుకు 308 టన్నులు వుండగా దాని సామర్థ్యం 330 పెంచనున్నామని ఆయన తెలిపారు.

అంతేకాకుండా కంపెనీలో కాంట్రాక్ట్ పధ్దతి మీద కొత్త వర్కర్స్ ని తీసుకుంటామని, వీరు రాత్రి సమయంలో, హాలిడేస్, వీకెండ్స్ లో పనిచేస్తారని దీనికి వర్కర్స్ అందరూ సమ్మతించారని ఆయన అన్నారు. దీనికి కారణం పేరంబ్రా ప్యాక్టరీలో ఎక్కువ ప్రోడ్యూస్ చేయగలిగే సామర్థ్యం వున్నందువల్ల. అపోలో టైర్స్ లాకౌట్ సమయంలో రోజుకు రూ 5 కోట్లు చోప్పున నష్టపోయిందని ఇప్పటివరకు రూ 600 కోట్లు నష్టపోయామని ఆయన అన్నారు. ప్రస్తుతం పేరంబ్రా ప్యాక్టరీ లో 2000 మంది ఉద్యోగులు ఉన్నారని ఆయన వివరించారు.

మూడు సంవత్సరాలకు సంబంధించిన ఎల్ టి యస్ అగ్రిమెంట్ మీద వర్కర్స్ మరియు యాజమాన్యం సంతకాలు చేశారని, ఇక ఎటువంటి ఇబ్బందులు వుండవని అపోలో టైర్స్ ఛీఫ్ సతీష్ శర్మ(ఇండియా ఆపరేషన్స్) వివరించారు.

Most Read Articles

Story first published: Wednesday, August 25, 2010, 13:02 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X