జపనీస్ ఆటోమొబైల్స్ దిగ్గజం ఇండియా ఆటోమార్కెట్ రంగంలోకి మరో చిన్నాకారు టోయోటా ఇతిహాస్ ను రంగంలోకి డిసెంబర్ లోదించడానికి సిధ్దంగా ఉన్నారు. దీనికి గాను బ్రాండ్ అంబాసిడర్ గాఅస్కార్ విన్నర్ సంగీత దిగ్గజం ఎఅర్ రెహామాన్ నినియమించడం జరిగింది. సందీప్ సింగ్ డిప్యూటి మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ ఎఆర్ రెహామాన్ గురించి ఎంత మాట్లాడినా అది చాలా తక్కువగా ఉంటుంది. అతను చాలా ఖచ్చితమైన మనిషి. అలాంటి వ్యక్తిని మా టోయోటా ఇతిహాస్ కు బ్రాండ్ అంబాసిడర్ గాఎంచుకోవడం మాకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఇండియా మొత్తం ఈ టోయోటా ఇతిహాస్ గురించి పలు ప్రమోషనల్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. టోయోటా ఇంజనీర్స్ కూడా ఇండియా అవసరాలుగా తగ్గట్టుగా ఈ టోయోటా ఇతిహాస్ నురూపోందించడం జరిగిందన్నారు. క్వాలిటి పరంగా, కాస్ట్ పరంగా సామాన్య మనుషులకు అందుబాటులో ఉండే విధంగా ధర నిర్ణయించడం జరిగిందన్నారు.
యోషినోరి నోరిటేక్ ఛీఫ్ ఇంజనీర్ (టోయోటా పాసింజర్ వెహికల్స్) మాట్లాడుతూ టోయోటా లో ప్రతి ఒక్కరు మాట్లాడూకునేది (క్యూడిఆర్) క్వాలిటీస్. క్యూడిఆర్ క్వాలిటీస్ ఖచ్చితంగా ఉంటే ఆ కారు చాలా ప్రజల మన్ననలను పోందుతుంది. ఈ టోయోటా ఇతిహాస్ నుకూడా అలాంటి అదే మాదిరి తయారు చేయడం జరిగిందన్నారు. ధర విషయంలో కూడా కస్టమర్స్ కు ఓ సరిక్రోత్త సర్ ప్రైజ్ ఇవ్వడానికి సిధ్దంగా ఉన్నామని అన్నారు. ఇండియా మార్కెట్ లో టోయోటా ఓసంచలనం సృష్టిస్తుందని అనుకుంటున్నాను. మనం ఖర్చుపెట్టిన డబ్బుకి ఫలితం కూడా లభిస్తుందని అన్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టోయోటా ఇతిహాస్ ను డిసెంబర్ మొదటి వారంలో ఇండియా మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.