మీరెంతగానో ఎదురుచూస్తున్న ఢిల్లీ ఆటో షో రేపే..!!

By

New Delhi Auto Expo
ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఘడియలు రానే వచ్చాయి. గల రెండు నెలలుగా ఎక్కడచూసిన ఏ ఆటోమొబైల్ నిపుణులు మాట్లాడుకున్నా ఢిల్లీ ఆటో షో ప్రస్తావనే. గత ఏడాది జరిగిన ఆటో షోలో టాటా నానో అందరి దృష్టిని ఆకర్షించగా ఈ దఫా ఏ ఆటోమొబైల్ కంపెనీ సింహభాగాన్ని అధిష్టిస్తుందో అని అందరూ ఆశక్తిగా ఎదురుచూసారు. అప్పుడు మీ నిరీక్షణకు తెరపడే తరుణం ఆసన్నమయింది. మీరెంతగానో ఎదురుచూస్తున్న ఢిల్లీ ఆటో షో రేపటి(జనవరి 5) నుండీ ప్రారంభం కానుంది. న్యూఢిల్లీ లోని ప్రగతి మైదాన్ లో ఈ ఆటో షో ప్రారంభం కానుంది. ఈ ఆటో షో 11వ తేదీ వరకూ జరుగనుంది.

న్యూఢిల్లీ ఆటో షో ప్రపంచంలో ఇప్పటి వరకూ జరిగిన ఆటో షోలలో ఉత్తమ ఆటో షో గా నిలవనుంది. ప్రపంచంలో చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతీయ ఆటోమొబైల్ రంగానికి ఈ ఆటో షో మరింత జీవాన్ని అందించనుంది. ఇప్పటి వరకూ ఈ ఆటో షోలో పది సరికొత్త కార్ల ఆవిష్కరణ ఖరారయింది. ఇందులో చాలా వరకూ భారతీయ మార్కెట్ ను టార్గెట్ చేసుకుని రూపొందించిన చిన్న కార్లు కావడం గమనార్హం.

అంతర్జాతీయ ఆటోమొబైల్ కంపెనీలు టయోటా మోటార్స్, హోండా, వోక్స్ వ్యాగన్, సుజుకి, బియండబ్యు, జనరల్ మోటార్స్ తో పాటు భారతీయ ఆటోమొబైల్ ధిగ్గజాలు టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి సుజుకి వంటి కంపెనీలు ఈ ఆటో షో కోసం ప్రత్యేకంగా కార్లను సిద్ధం చేసారు. మారుతీ సుజుకి 'ఫ్యామిలీ' కారు...'ఈకొ', హమ్మర్ వంటి భారీ కార్లను రూపొందించిన జనరల్ మోటార్స్ తన రూటు మార్చుకొని రూపొందించిన చిన్న కారు 'బీట్', ఫోర్డ్ సంస్థ రూపొందించిన చిన్న కారు ఫిగో, వోక్స్ వ్యాగన్ రూపొందించిన చిన్న కారు పోలో కాంపాక్ట్ ఈ ఆటో షోలో ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయి. భారతీయ ఆటోమొబైల్ కంపెనీ మారుతీ సుజుకీ రూపొందించనున్న చిన్న కారు కూడా ఇక్కడ ప్రదర్శనకు రానుంది.

వీటికి తోడు భారతీయ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ సరికొత్త మల్టీపర్పస్ వెహికల్ టాటా ఇండిక్రూజ్, ఇండికా విస్తా ఇగ్నిస్, టాటా ప్రీమియం ట్రక్కు ఈ ఆటో షో లో విడుదలకానున్నాయి. ఇక టాటా మోటార్స్ లో బహుళజనాదరణ పొందిన ఇండికా ఎలక్ట్రిక్ వెర్షన్ కారు, నానో హైబ్రిడ్ మోడల్ లను కూడా ఈ ఆటో షోలో ప్రదర్శనకు తీసుకురావడానికి టాటా మోటార్స్ సన్నాహాలు చేస్తోంది.

కాగా ఈ సారి జరిగే ఆటో షోలో మారుతీ సుజుకీ ప్రధాన ఆకర్షణగా నిలువనుంది. ఈ ఆటో షోలో మారుతీ సుజుకీ ఏకంగా 17 విభిన్న కార్ మోడళ్లను ప్రదర్శనకు తీసుకురానున్నట్టు సమాచారం. ఈ ప్రదర్శనలో సుజుకి కిజాషి మరియు SX4 వంటి సరికొత్త కార్ల ఆవిష్కరణ తో పాటుగా ఇందులో మరిన్ని రాబోవు కార్ల మోడళ్లు ప్రదర్శనకు రానున్నట్టు సమాచారం.

కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ), సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్(సిఐఎయం) మరియు ఆటోమొటివ్ కాంపొనెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎసియంఎ) లు కలసి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఆటో షో రెండు మిలియన్ మంది సందర్శకులు వీక్షించేలా ఏర్పాట్లు చేసారు. ఇప్పటి వరకూ న్యూయార్క్ లో జరిగిన ఆటో షో ను అత్యధికంగా 1.2 మిలియన్ మంది సందర్శకులు వీక్షించేలా ఏర్పాట్లు చెయ్యగా ఈ ఢిల్లీ ఆటో షో ఈ రికార్డును బ్రేక్ చెయ్యనుంది.

More from DriveSpark

Article Published On: Monday, January 4, 2010, 18:02 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+