ఈ ఏడు శుభారంభం చేసిన ఆటోమొబైల్ రంగం..!!

By

Hyundai
ఈ ఏడాది భారతీయ ఆటోమొబైల్ రంగానికి మంచి ఆరంభం ఎదురయింది. జనవరి మొదటి వారంలో నిర్వహించిన ఢిల్లీ ఆటో షో ఘనవిజయం సాధించడమే కాకుండా ప్రపంచ అతి పెద్ద ఆటో షోగా అవతరించింది. ఆ తర్వాత గత ఏడాది 280 కోట్లకుపైగా నష్టాలను చవిచూసిన టాటా మోటార్స్ ఈ ఏడాది 400 కోట్లకు పైగా లాభాలను ఆర్జించింది. ఆ తర్వాత మారుతీ సుజుకి గత ఏడాది జనవరిలో 71,779 యూనిట్లను అమ్మగా, ఈ ఏడాది 95,649 అమ్మకాలను నమోదుచేసుకుంది.

భారతీయ రెండవ అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీ హుందాయ్ మోటార్స్ కూడా గత ఏడాదితో పోల్చితే డొమెస్టిక్ మార్కెట్ లో 40.8% శాతం వృద్ధిని, ఎగుమతుల్లో 42.6% వృద్ధిని నమోదుచేసింది. మరో లీడింగ్ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా కూడా 71% వృద్ధిని నమోదుచేసుకొని లాభాల బాటన పయణిస్తోంది.

దీనిపై ఓ ప్రముఖ ఆటోరంగ విశ్లేషకుడు స్పందిస్తూ, "ఈ ఏడాది మనకు మంచి ప్రారంభం లభించింది. ఇది ఇలాగే కొనసాగే అవకాశాలు వున్నాయి" అనే ఆశాభావాన్ని వ్యక్తం చేసారు.

Most Read Articles

Story first published: Monday, February 1, 2010, 16:07 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X