భారతీయ కార్ల భద్రత ఏమాత్రం..!?

మరి ఇలాంటి పరిస్థితుల్లో భారత్ కు చెందిన ఆగ్రగామి ఆటోమొబైల్ సంస్థలయిన టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి సంస్థలు రూపొందించే కార్ల భద్రత ఏ మాత్రం అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. బహుళజాతి సంస్థలు ఇతర దేశాల్లో అనుసరించే రీ-కాల్ పద్ధతినే భారత్ లోకూడా అనుసరిస్తున్నారు. కానీ భారతీయ ఆటోమొబైల్ సంస్థలు మాత్రం ఇలాంటి పద్ధతిని అనుసరిస్తున్న ఆనవాళ్ళు లేవు. కేవలం వినియోగదారుడి నుండీ ఏదైనా ఫిర్యాదు అందితేనే సరిచేసి ఇస్తారు కానీ రీ-కాల్ లాంటి పద్ధతులు అనుసరించిన దాఖలాలు లేవు.
ఇటీవలే టాటా మోటార్స్ వారి చిన్న కారు నానో లో స్టీరింగ్ వద్ద ఏర్పాటు చేసిన బ్యాటరీ లోపం వల్ల అహ్మదాబాద్, ఢిల్లీ నగరాల్లో నిలిపివున్న నానో కార్లలో మంటలు రేగాయి. ఈ సమయంలో కారులో ఎవ్వరూ లేకపోవడంతో ఎవరూ గాయపడలేదు. కానీ నిరసనలు వెలుత్తడంతో టాటా సంస్థ ఆ మూడు కార్లలోని లోపాలను సరిచేసి ఇచ్చిందే కానీ రీ-కాల్ కు పిలుపివ్వలేదు. మరి అలాంటప్పుడు మిగితా కార్ల భద్రత ఏ మాత్రం అంటే ప్రశ్నార్థకమే.
కానీ ఇతర దేశాలతో పోల్చితే భారత్ లో వాహన భాగాల తయారీ సంస్థలు చక్కని నాన్యతా ప్రమాణాలను పాటిస్తున్నాయి. పైపెచ్చు వాహన భాగాలకు భీమా వీలు వుంటుంది. అంతే కాకుండా భారతీయ వినియోగదారులది సర్దుకుపోయే మనస్థత్వం. కానీ పాశ్చాత్యులు అలా కాదు. ప్రతి చిన్న లోపాన్ని భూతద్దంలో పెట్టి చూస్తారు. భారత్ లో నానో కారులో సంభవించినట్టి ప్రమాదాలు పాశ్చాత్య దేశాల్లో చోటుచేసుకొని వుంటే పెద్ద రాద్ధాంతం అయివుండేది. చిన్నలోపానికి కూడా బెంగటిల్లుతుంటారు. కానీ భారతీయుల మనస్థత్వం అలాంటిది కాదు. అలా సర్ధుకుపోతున్న మన కార్ల భద్రత ఏమాత్రం అంటే మాత్రం ప్రశ్నార్థకమే...!?


Click it and Unblock the Notifications








