నానో కిపోటీగా బజాజ్ నుంచి ఆల్ట్రా లోకాస్ట్ కార్..

రతన్ టాటా ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి ఆయన కలలకారు మరియు సామాన్యుడు కారు టాటా నానో నవంబర్ లోసేల్స్ కోంచెం తగ్గాయని ప్రముఖులు అంటున్నారు. కారు ప్రవేశపెట్టినప్పుడు ఈకారుపై ప్రపంచం మొత్తానికి కొన్ని అంచనాలు ఉన్నాయి. ఐతే కారు మార్కెట్ లోకి అడుగుపెట్టన తర్వాత మాత్రం ఆఅంచనాలు తారుమారు అయ్యాయి. దానికి కారణం కారులో నాణ్యత లోపాలను సరిగా పాటించలేకపోవడం వల్లనే అగ్ని ప్రమాదాలు జరిగాయంటూ చాలా మంది కస్టమర్స్ వాటిపై కంప్లైంట్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆతర్వాత దీనికి దిద్దుబాటు చర్యలు టాటావారు చేపట్టారుఅనుకోండి.

ఇక ఇప్పుడు ఇండియన్ టూవీలర్స్ రంగంలో రారాజు అయినటువంటి బజాజ్ కంపెనీ కొత్తగా ఓబుల్లి చిన్నకారు ప్రాజెక్టుని టాటా నానోకి పోటీగా మొదలు పెట్టింది. దీని పేరు కూడా చాలా వెరైటీగా అందరికి అందుబాటులో ఉండేవిధంగా ఆల్ట్రా లోకాస్ట్ కార్ అని నామకరణం చేయడం జరిగింది. ఇక ఈ ఆల్ట్రా లోకాస్ట్ కార్ నిమూడు కంపెనీలు కలసి తయారు చేయడానికి నిర్ణయించుకున్నాయి. అందులో బజాజ్-రేనాల్ట్-నిస్సాన్ లుకలసి తయారుచేయనున్న ఈకారు ఖరీదు కూడా సామాన్యుడుకి అందుబాటు ధరలో ఉండేటట్టు రూ1.5లక్షలు నిర్ణయించడం జరిగిందని అన్నారు.

ఇక యమ్ డి బజాజ్ కంపెనీ మాట్లాడతూ ఈకారు ఓచరిత్రను తిరగరాయనుందని అన్నారు. ఈకారు రేనాల్ట్-నిస్సాన్-బజాజ్ కంపెనీ నుండి వస్తుందంటే దాని బ్రాండ్ ఇమేజి ఏరకంగా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఈకారు మైలేజి కూడా బాగా వస్తుందని అన్నారు. లీటర్ దాదాపు 30కిమీ వరకు వస్తుందని తెలిపారు. ఇక బజాజ్ బైక్స్ విషయానికి వచ్చే సరికే పల్సర్ మరియు డిస్కవర్ బైక్స్ మాకు కస్టమర్స్ నుపెంపోందించడంలో బాగా సహాయపడుతున్నాయని అన్నారు. చివరగా ఈకారు వల్ల మేము మాస్ జనాలకు బాగా దగ్గరవ్వుతామన్న ధీమా వ్యక్తం చేశారు.

Article Published On: Thursday, December 9, 2010, 11:51 [IST]
English summary
The ongoing situation has not concerned the Indian two wheeler maker Bajaj to go ahead with its proposed small car project called Ultra low cost car. Keeping aside the sale momentum of Nano, Bajaj has set an upbeat moment for its proposal and it still retains the second largest in two wheeler sector. The Ultra low cost car from Bajaj is a tripartite venture among Bajaj-Renault-Nissan which is slated for formal launch in 2012.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+