టాటా నానోతో పోటికి సిద్దం అంటున్న బజాజ్(యు ఎల్ సి)..!

రాజీవ్ బజాజ్(యండి) మాట్లాడుతూ ప్రపంచంలో తక్కువ ఖరీదు గల టాటా నానో మాదిరే మేము కూడా ఈ కారుని మీకు తక్కువ ధరకే ఇవ్వడం జరుగుతుందన్నారు. తక్కువ ఖరీదు గల టాటా నానో ప్రవేశపెట్టేటప్పుడు రతన్ టాటా నానో ఖరీదు లక్ష రూపాయలు అనిచెప్పినప్పుడు ప్రపంచంలోని ఆటోమార్కెట్ మొత్తం వింతగా చూసింది.
బజాజ్ పల్సర్ ద్వారా మేము టూ వీలర్స్ రంగంలో మేము ఒక ట్రెండ్ ని నిర్మించాం. ఇప్పుడు అదే నమ్మకంతో ఫోర్ వీలర్స్ రంగం లోకి అడుగుపెడుతున్నాం. ఈ లో కాస్ట్ కారు మీకు నాణ్యత లో గాని, స్టైల్ లోగాని, సామర్ద్యంలోగాని అనుకూలంగా వుంటుంది. మొత్తానికి టాటా నానోకి పోటీగా దించుతున్న బజాజ్ లో కాస్ట్ కారు హిట్ అవుతుందో ఫట్ అవుతుందో చూడాలంటే వచ్చేవరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications