మిగతా రంగాలలో కూడా మా తడాఖా చూపిస్తాం అంటున్న ..

కొత్తగా 4-7 టన్నుల సరుకును రవాణా చేయగలిగే తేలికపాటి వాణిజ్యవాహనాన్ని (ఎల్ సీ వీ)2011లో నిస్సాన్ కంపెనీతో కలిసి ఆవిష్కరించనున్నాం. దీని ధర కూడా రూ 5 లక్షల నుండి రూ 7 లక్షల వరకు ఉంటుంది. ఇవి చెన్నై, హొసూరు ప్లాన్ ట్స్ లో తయారవుతాయి. అమెరికాకి చెందిన జాన్ డియర్ భాగస్వామ్యంతో నిర్మాణరంగం అవసరాలను తీర్చే యంత్రాలు, వాహానాలను రూపోందిస్తాం. ఐరొపా తరహా బస్సులను కూడా రూపోందిస్తున్నాం.
అలాగే వాహన తయారి సామర్ద్యం కూడా పెంచనున్నాం. మాకు మొత్తం 1,00,000 వాహలను తయారు చేసే సామర్ద్యం ఉంది. గత మార్చిలో ఉత్తరాంతల్ లో 50,000 వాహనాలను ఉత్పత్తి చేసే ప్లాంటును ప్రారంభించాం. బీఎస్ ప్రమాణాలతో బస్సులు, లారీలు ఉత్పత్తికి సిద్దంగా ఉన్నాం. అంతేకాకుండా వాహనాల ఎలక్ట్రానిక్, ఐటీ-ఇంజనీరింగ్, హరిత సాంకేతిక పరిజ్ఞానం రంగాలకు విస్తరిస్తున్నాం. విద్యుత్తు రంగంలో వినియోగించే ఇంజన్ల తయారీ కోసం లే పవర్ అనే సంస్దను స్దాపించాం. వాహన ఎలక్ట్రానిక్స్ కోసం జర్మనీ కంపెనీ కాంటి నెంటల్ తో భాగస్వామ్యం ఉంది. అత్యాధునిక జీపీ ఎస్ పరికరాలు రూపొందిస్తున్నాం. ఉదాహపణకు బస్సు ఎంత దూరాన ఉంది. ఎంత సేపట్లో వస్తుంది, సీట్లు ఖాళీ ఉన్నాయా .. తదితర వివరాలను బస్టాపుల్లో ఉన్న అత్యాధునిక ఎలక్ట్రానిక్ బోర్డుల్లో తిలకించవచ్చు. చెన్నై లో 600 బస్సుల్లో ఈ ఏర్పాట్లు చేస్తున్నామని హిందుజా ఆటోమోటివ్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, అశోక్ లేలాండ్ బోర్డు సభ్యుడు వి.సుమంత్రన్ చెప్పారు.


Click it and Unblock the Notifications








