జర్మన్ కార్లు తయారీ సంస్ద అయినటువంటి బియమ్ డబ్ల్యు నుంచి మరో కొత్త కారు యక్స్ 1 ఇండియా ఆటోమొబైల్స్ రంగంలోకి విడుదల చేయడానికి రంగం సిద్దం చేశారు. ఈకారు విషయానికి వస్తే దీని ఖరీదు దాదాపు రూ23లక్షలుగా ఉంటుందని, ఇది మాత్రమే కాకుండా ఈకారు డిజిల్ మరియు పెట్రోల్ రెండు వర్సన్ లలో లభిస్తుందని తెలిపారు. ముఖ్యంగా ఈకారులో రెండు మోడళ్శు ని మొదటగా విడుదల చేస్తున్నామని అన్నారు. అందులో మొదటిది యక్స్1 కార్పోరేట్ ఎడిషన్, రెండవది యక్స్1 హైలైన్. ఇకపోతే పెట్రోల్ వర్సన్ కుసంబంధించినటువంటి ఇంజను కెపాసిటీ 1.8లీటర్ కాగా, డీజిల్ వర్సన్ కుసంబంధించి వర్సన్ 2.0లీటర్ ఇంజనుగా ఉన్నాయని అన్నారు.
ప్రస్తుతానికి ఈకారుని చెన్నై ప్లాంటులో అసెంబ్లింగ్ చేస్తున్నామని, రాబోయే కాలంలో ఈకారు అమ్మకాలను దృష్టిలో పెట్టుకోని ఇండియాలోనే తయారు చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ఈ యక్స్1 కారు విశేషాలు ఏంటంటే 1955సిసి, 4సిలెండర్ డీజిల్ ఇంజను కలిగి ఉన్నాయని అన్నారు. ఇక ఈకారు స్పీడ్ చెప్పాల్సిన పనిలేదని అన్నారు.