బియమ్ డబ్ల్యు అంబుల పోదిలోకి మరో రెండు కొత్త కార్లు...!

BMW X5
లగ్జరి కార్లను తయారు చేయడంలో రారాజు బియమ్ డబ్ల్యు. ఈ సంవత్సరం ప్రకటించిన ఫలితాలలో మెర్సిడెస్ బంజ్ కున్న నెంబర్ వన్ స్దానాన్ని తను కైవసం చేసుకుంది. అంతేకాకుండా ఆటోమొబైల్స్ రంగంలో ఒక వినూత్నరంగానికి శ్రీకారం చుట్టింది బియమ్ డబ్ల్యు. అటువంటి బియమ్ డబ్ల్యు నుండి కోత్తగా మరోక రెండు మోడళ్శను మార్కెట్ లోకి ప్రవేశపెట్టనున్నారు. దానితో పాటు కొత్తగా గుర్గావ్ లో కొత్త డీలర్ షిప్ ని లాంచ్ చేయడం జరిగింది. కొత్తగా బియమ్ డబ్ల్యు X5 సిరిస్ నుండి బియమ్ డబ్ల్యు X5 xడ్రైవ్ 50ఐ(పెట్రోల్) మరియు బియమ్ డబ్ల్యు X5 xడ్రైవ్ 30డి(డీజిల్) అనే రెండు కొత్త మోడళ్శను విడుదల చేయడానిక సన్నాహాలు చేస్తున్నారు. ఈ రెండు కొత్త మోడళ్శు అక్టోబర్ నుండి మార్కెట్ లోకి రానున్నాయని తెలిపారు. ఇక ధరల విషయానికి వస్తే బియమ్ డబ్ల్యు X5 xడ్రైవ్ 50ఐ(పెట్రోల్) ధర 69,50,000 లక్షలు ఉండగా బియమ్ డబ్ల్యు X5 xడ్రైవ్ 30డి(డీజిల్) ధర 52,99,000 లక్షలుగా ఉంటుందని అన్నారు.

డా. ఆండ్రీస్ స్కాప్ (ప్రెసిడెంట్ బియమ్ డబ్ల్యు ఇండియా) మాట్లాడుతూ బియమ్ డబ్ల్యు X మోడల్ సిరిస్ మాదిరే ఈ రెండు మోడల్స్ కూడా కస్టమర్స్ యొక్క మన్నలను పోందుతుందని అన్నారు. బియమ్ డబ్ల్యు X సిరిస్ లో డిజైన్ పరంగాకాని, నాణ్యతా విషయాలలో మీకు స్పష్టంగా తెలస్తుందని, అంతేకాకుండా బియమ్ డబ్ల్యు X సిరిస్ మోడల్స్ మీకు డ్రైవింగ్ విషయంలో సేప్టీ, సామర్ద్యం, లుకింగ్ లోగాని మీకు వావ్ అనేలా ఉంటుందని అన్నారు.

బియమ్ డబ్ల్యు X5 xడ్రైవ్ 50ఐ(పెట్రోల్) కారు విషయానికి వస్తే వి8 పవర్ యూనిట్ ఫీచర్స్ తో పాటు డైరెక్ట్ పెట్లోల్ ఇన్ జెక్షన్ తో అవుట్ పుట్ సామర్ద్యం300 kW/407 hp కలిగి ఉంటుందన్నారు. అన్ని బియమ్ డబ్ల్యు X5 వెహికిల్స్ 8 స్పిడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ మాదిరే వీటికి కూడా ఆ సౌకర్యం కల్పించామన్నారు. ఈ కొత్త బియమ్ డబ్ల్యు X5 లేటేస్ట్ ఐడ్రైవ్ కంట్రోల్ సిస్టమ్ ను కలిగిఉందన్నారు. దీనివలన యూనిక్ డ్రైవర్ అసిస్టన్స్ మరియు సిస్టమ్ కంపర్ట్ కలిగి ఉంటుందన్నారు. కొత్త బియమ్ డబ్ల్యు X5 కార్లు బ్లాక్ షాప్పేర్, స్పేస్ గ్రేస్, టైటానియమ్ సిల్వర్, ప్లాటినమ్ బ్రోంజ్ కలర్స్ లో లభ్యమవుతాయన్నారు. అంతేకాకుండా డీప్ బ్లూ సీ, ప్లాటినమ్ గ్రే, స్పార్కలింగ్ బ్రోంజ్ ఈ మూడు కలర్స్ బియమ్ డబ్ల్యు లో ప్రవేశపెట్టనటువంటి కొత్త కలర్స్ అన్నారు.

చివరగా బియమ్ డబ్ల్యు ఇండియా లగ్డరికార్లైన ఆడి మరియు మెర్సిడెస్ బెంజి నుండి గట్టి పోటీని ఎదురు కుంటుందన్నారు. ఈ కొత్త కార్లను ప్రవేశపెట్టడం మరియు డీలర్ షిప్ లను పెంపోందించడం వల్ల వాటికి గట్టి పోటీని ఇవ్వడమే కాకుండా ఇండియన్ ఆటోమొబైల్స్ రంగంలో ఒక చరిత్రను తిరగరాయడానికి ప్రయత్నస్తున్నామన్నారు.

More from DriveSpark

Article Published On: Thursday, September 23, 2010, 14:10 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+