ఆటో షోలో తారల సందడి...!!

ఆ తర్వాత అదే రోజున బాలీవుడ్ సెక్సీ హీరో జాన్ అబ్రహం తనకు బైకుల మీదున్న మోజును చాటుకుంటూ ఓ యమహా సరికొత్త R1 బైకును విడుదల చెయ్యడానికి ప్రగతి మైదాన్ కు విచ్చేసి సందడి చేసాడు. ఆ తర్వాత ఆయన బైకులను జాగ్రత్తగా ఎలా నడపాలి అని తన అభిమానులకు కొన్ని సూచనలు చేసారు. బైకు నడిపేప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ఆయన అభ్యర్థించాడు.
ఇక రెండవ రోజున బాలీవుడ్ సూపర్ స్టార్ బాద్షా షారూఖ్ ఖాన్ తను బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న హుందాయ్ మోటార్స్ i10 ఎలక్ట్రిక్ వెర్షన్ కారును ఆవిష్కరించడానికి ప్రగతి మైదాన్ కు విచ్చేసాడు. కాగా 2007 లో జరిగిన ఆటో షోలో షారుఖే i10 కారును ఆవిష్కరించారు. ఇప్పుడదే కారు ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా షారూఖ్ విడుదల చెయ్యడం గమనార్హం.
బాలీవుడ్ సెక్సీ హీరోయిన్ బిపాషా బసు మెర్సిడెస్ సంస్థకు చెందిన సరికొత్త కారును ఆవిష్కరించడానికి ఆటో షోని సందర్శించగా, మరో నటుడు వివేక్ ఒబెరాయ్ దిలీప్ ఛబ్రియాస్ రూపొందించిన ఇంపిరేటర్ కారును ఆవిష్కరించడానికి ఆటో షోకు వచ్చి వీక్షకులను ఆకర్షించాడు. బాలీవుడ్ నటులకు తనేమీ తీసిపోనని మాజీ క్రికెటర్ కెప్టెన్ సౌరబ్ గంగూలీ కూడా గత బుధవారం రోజున కోల్ కతా కేంద్రంగా పనిచేస్తున్న విబ్జియార్ వెహికల్స్ వారి బైకులను ఆవిష్కరించేందుకు ఆటో షోను సందర్శించి పలువురిని ఆకర్షించాడు. జనవరి 15 వరకూ జరగనున్న ఈ ఆటో షోలో ఇంకెందరు సెలబ్రిటీలు తలుక్కమననున్నారో చూడాలి...!!


Click it and Unblock the Notifications








