ప్రపంచంలో అతి తక్కువ ధరపలికే మధ్యతరగతి కారు టాటా నానో ఇండియాలో గత ఏడాది జరిగ ఆటోషో విడుదలయి అందరి దృష్టిను ఆకర్షించింది. అటు పైన రికార్డు స్థాయిలో బుకింగులు నమోదుచేసుకుంది. తాజాగా నానో హైబ్రిడ్ వెర్షన్ కూడా తయారవుతోంది. తాజా ఈ లక్ష కారు అమెరికా మార్కెట్ లో అడుగుపెట్టింది. ఫ్రాంక్ ఫర్ట్ లో జరుగుతున్న ఆటో షో ఇందుకు వేదికయింది. అంతా బాగానే వుంది కానీ ఈ బుజ్జి కారు అమెరికాలో 'లక్ష'ణమయిన కారుగా చెలామణీ అయ్యే అవకాశాలు లేవు. అమెరికా భద్రతా మరియు ఎమన్షన్ స్టాండర్డ్స్ కు అనుకూలంగా తయారవ్వాలంటే ఈ కారు ధర సుమారు 8,000 డాలర్లుగా (అనధికార ధర) పలికే అవకాశం వుంది.
ఫ్రాంక్ ఫర్ట్ ఆటో షో తొలి సారి అమెరికన్ల ముందు ఠీవీగా నిలబడ్డ మన నానోకు మంచి స్పందన లభిస్తోంది. ధర 8,000 డాలర్లుగా నిర్ణయించినప్పటికీ ఈ కారు అమెరికాలో చవక కారే కావడం గమనార్హం. ఇంకా అధికారికంగా ధరను ప్రకటించకపోయినప్పటికీ 8,000 డాలర్లకు అటుఇటుగానే నిర్ణయించే అవకాశం వుంది. అన్నీ అనుకూలిస్తే ఈ కారు మరో మూడేళ్లలో అమెరికా రహదార్ల మీజ పరుగులు తీయనుంది.