మహేంద్రా రేవా ఇప్పుడు రూ3.10లక్షలు..

Mahindra Reva
మహేంద్ర కంపెనీ ఛీప్ ఆపరేటింగ్ ఆఫీసర్ మాట్లాడుతూ మహేంద్ర రేవా ఎలక్ట్రిక్ వాహానాలు ఖరీదుని రూ 3.10లక్షలుగా నిర్ణయించడం జరిగిందని అన్నారు. రాబోయే 18నెలలలో కంపెనీ యొక్క సేల్స్ మూడింతలు పెంచే దిశగా ఆలోచనలో భాగంగానే ఈనిర్ణయం తీసుకోవడం జరిగిందని అన్నారు. ప్రస్తుతం కంపెనీ యొక్క సేల్స్ 1200యూనిట్లు ఉండగా త్వరలో 3600యూనిట్లుకి పెంచనున్నామని, అందులో 3000యూనిట్లు జాతీయంగా ఉన్నటువంటి ఆటోమొబైల్స్ రంగంలో అమ్మకాలు జరపాలని, అధేవిధంగా మిగిలినటువంటి సేల్స్ ని ఎగుమతి చేయనున్నట్లు తెలిపారు.

అంతేకాకుండా రాబోయే కాలంలో మహేంద్ర రేవా నుండి 4-సీటర్ వాహానాలను కూడా ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. దీనికి కారణం ఇండియాలోని ఆటోమొబైల్స్ రంగంలో ఎలక్ట్రిక్ వాహానాలకు మంచి గిరాకీ ఉండడమేనని అన్నారు. అంతేకాకుండా అమ్మాకాలను పెంచడంలో డీలర్స్ కూడా మంచి పాత్రను పోషిస్తారు. అందుకే రాబోయే రెండు సంవత్సరాలలో వంద డీలర్స్ షిప్స్ ను ఏర్పాటు చేస్తున్నామని, వీటిని ఇండియా మొత్తం మీద డెబ్బై సిటీస్ లలో ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.

గతంలో బెంగుళూరు రేవా ఎలక్ట్రిక్ కార్లును మహేంద్రా హాస్తగతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీనికి గాను రేవా కంపెనీకి గాను డాలర్ 7.1బిలియన్ చెల్లించడం జరిగింది. వచ్చే జూన్ నుండి బెంగుళూరు యూనిట్ పూర్తిగా పని చేయడం వల్ల ప్రస్తుతం 24000యూనిట్లు ఉత్పత్తి చేసే కెపాసిటీని దాదాపు 30000 యూనిట్లకు పెంచనున్నామని తెలిపారు.

More from DriveSpark

Article Published On: Tuesday, December 14, 2010, 11:32 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+