ప్రతి 25 కిమీకు ఒక సర్విస్ సెంటర్..!

అలాంటి మారుతి కంపెనీ రాబోయే కాలాన్ని దృష్టిలో పెట్టుకోని కొత్తగా కార్లు కోనేవాళ్శ కోసం మరియు ప్రస్తుతం ఉన్న కస్టమర్స్ కోసం రానున్న అయిదు సంవత్సరాలలో దాదాపు 1500 సర్విస్ సెంటర్స్ ని ప్రారంభించాలని అనుకుంటున్నారు. రాబోయే సంవత్సరాలలో ప్రోడక్షన్ నుపెంచుకుందామని అనుకుంటున్న సమయంలో కంపెనీకి సర్వీస్ సెంటర్స్ కూడా చాలా ముఖ్యం అందుకే ఈనిర్ణయాన్ని తీసుకున్నామని అన్నారు.
రోబోయే కాలంలో పోడక్షన్ కెపాసిటిని 17లక్షలకు పెంచనున్నట్లు తెలిపారు. ప్రస్తుతానికి భారతదేశం మొత్తం మీద 2,784 సర్విస్ పాయింట్లు ఉన్నాయని వాటిని 2015వ సంవత్సరం నాటికి 50శాతం అంటే 4200సర్విస్ పాయింట్లకు పెంచనున్నామని తెలిపారు. అంతేకాకండా ప్రతి 25కిమి లకు ఓ సర్విస్ పాయింటే ఉంటే విధంగా జాగ్రత్తలు తీసుకోనున్నామని తెలిపారు.
ప్రస్తుతం మారుతి సర్విస్ సెంటర్స్ నెలకు 11.8లక్షల కార్లకు మాత్రమే సర్విస్ ఆఫరింగ్ చేస్తున్నాయని వీటి సామర్ద్యం కూడా 14.5-15 లక్షల యూనిట్ల కార్లకు రోబోయే అయిదు సంవత్సరాలలో పెంచనున్నామని తెలిపారు. హర్యానాలోని మనేసర్ లోమూడవ ప్లాంట్ కోరకు రూ1,925 కోట్లు పెట్టుబడి పెట్టనున్నామని కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అన్నారు. ఈ యూనిట్ గనుక వాడుకలోకి వచ్చినట్లైతే సంవత్సరానికి 17.5 లక్షల కార్లు ఉత్పత్తి చేయవచ్చుఅన్నారు.


Click it and Unblock the Notifications








