మరింత ప్రియం కానున్న ఎవిరిడే బ్యాటరీస్...

ఇక ఎవిరిడే బ్యాటరీస్ ఇండస్ట్రీస్ విషయానికి వస్తే ఇండియాలోని బ్యాటరీస్ తయారీ రంగంలో ఎవరిడేస్ కుచాలా ప్రత్యేకత ఉందని అన్నారు. సంవత్సరానికి దాదాపు 1.2బిలియన్ డ్రై బ్యాటరీస్ అమ్మకాలు జరుపుకుంటాయని అన్నారు. ఈకార్బన్ జింక్ బ్యాటరీస్ మాత్రమే కాకుండా ఇండియాలో ఉన్నటువంటి ప్రతి కుగ్రామానికి వెలుతురు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈకార్యక్రమం వల్లనే ఈరోజు మనం వాడేటటువంటి టార్చిలైట్, రిచార్జబుల్ బ్యాటరీస్ సియఫ్ ఎల్, జియల్ యస్ లాంటి లైట్స్ ను అందించారు. వీటితోపాటు పోయిన సంవత్సరం కొత్తగా యల్ ఇడి లాంతర్స్ అందుబాటులోకి తీసుకొనివచ్చారు. ఈ యల్ ఇడి లాంతర్స్ వల్ల ఇండియాలోని మారుమూల గ్రామాలకు కూడా వెలుతురుని విస్తరింపజేసినటువంటి ఘనతను సోంతం చేసుకున్నారు.
ఎవిరిడే బ్యాటరీస్ కుఇండియా మొత్తం మీద 4000డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారని చాలా ఘనంగా చెప్పుకోవడానికి సంతోషంగా ఉందని అన్నారు. ఇది మాత్రమే కాకుండా 8లక్షల రిటైల్ అవుట్ లెట్స్ కు డైరెక్టుగా మాతో సంబంధాలు ఉన్నాయని అన్నారు.


Click it and Unblock the Notifications








