బడ్జెట్ లో పన్నుల కొరడా, పెరిగిన పెట్రోధరలతో ఇక వాహనాలు కొనే వారి సంఖ్య తగ్గుతుందనే అందరూ భావించారు. కానీ అందరి అంచనాలనూ తలక్రిందుల చేస్తూ ఫిబ్రవరి నెలలో అమ్మకాలు ఇంతకు ముందెన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో పెరుగుదలను నమోదుచేసుకున్నారు. సుమారు 34.98 శాతం పెరుగుదలను నమోదుచేసుకుంది. సియామ్(Society of Indian Automobile Manufacturers) నివేదిక ప్రకారం ఫిబ్రవరి నెలలో 11,29,783 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. ఇవి గత ఏడాది ఫిబ్రవరిలో జరిగిన 8,37,017 యూనిట్ల అమ్మకాల కంటే 35 శాతం ఎక్కువ.
ఇక ఇటీవలి కాలంలో ఆటోమొబైల్ అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ఆటోఉత్పత్తుల అమ్మకాల పెరగడం ఇది వరుసగా పదకొండవ సారి. గత పదకొండు నెలలుగా ఆటో ఉత్పత్తుల అమ్మకాలు ఏమాత్రం తగ్గుదలను నమోదుచేసుకోకపోవడం విశేషం. మారుతీ సుజుకీ, హుందాయ్ మోటార్స్, జనరల్ మోటార్స్ వంటి ప్రముఖ సంస్థలన్నీ అమ్మకాలలో పెరుగుదలను నమోదుచేసుకోవడం విశేషం.