టాటా నానో ఫ్రీ డ్రైవ్..

Tata Nano
రతన్ టాటా కలలకారు టాటానానో. గతంలో టాటా నానో కారుని సోంతం చేసుకోవాలనుకుంటే దానిని బుక్ చేసుకోవడం తప్పనిసరి. బుక్ చేసిన తర్వాత మరలా కోన్ని రోజులు నిరీక్షించాల్సిన పరిస్దితి. అలాంటి కష్టకాలానికి ఇక చెక్ చెప్పాల్సిన పరిస్ధితి కల్పించారు టాటా కంపెనీ వారు. దానికి కారణం టాటా నానో ప్రోడక్షన్ పెరగడం. ఇప్పటికే భారతదేశంలోని కోన్ని పట్టణాలు అయినటువంటి వెస్ట్ బెంగాల్, యుపి, మహారాష్ట్ర, కర్ణాటక లాంటి వాటిల్లో టాటానానో ఓపెన్ సేల్ పెట్టిన సంగతి అందరికి తెలిసిందే.

అధేవిధంగా ఇప్పుడు టాటా నానో ఇంకోక కోత్త పద్దతికి శ్రీకారం చుట్టింది. బీహార్, ఛంఢీఘర్, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్ మరియు గుజరాత్ లాంటి సిటిస్ లలో ఉచితంగా డ్రైవ్ పెట్టి టాటా నానో విశిష్టతను కస్టమర్స్ కుతెలియజేయనుంది. అంతేకాకుండా టాటానానోని బుక్ చేసుకున్న అతి కోద్దిరోజులకే కెంపెనీ నుండి డైరెక్టుగా కస్టమర్ కుచేరవేసేందుకు సిద్దంగా ఉందని అన్నారు. దానికి కారణం టాటానానో రెండు ప్రోడక్షన్ సెంటర్లు అయినటువంటి హియాచల్ ప్రదేశ్ లోని పంత్ నగర్ మరియు గుజరాత్ లోని సనందా ప్రోడక్షన్ స్పీడ్ నుపెంచడమే.

అంతేకాకుండా టాటానానో భారతదేశంలోని 26 నేషనల్ బ్యాంక్స్ తోటాటానానో కస్టమర్స్ కులోన్ ప్రక్రియలో ఒప్పందం కుదుర్చుకుంది. టాటానానో పాయింట్స్ మరియు మరియు ఉచితంగా టాటానానో డ్రైవ్ నికూడా ఆఫర్ చేస్తున్నారు. గుజరాత్ లోని సనందా ప్లాంటు బాగా ఊపందుకుంటే ఈడిసెంబర్ కల్లా దాదాపుగా నెలకు 20000యూనిట్లు ఉత్పత్తి చేసే సామర్ద్యం ఉంటుందని అన్నారు. గతంలోలాగా ఫైర్ యాక్సిడెండ్స్ లాంటి జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని అన్నారు.

Most Read Articles

Story first published: Tuesday, November 23, 2010, 10:30 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X