టెక్నాలజీలో అన్ని దేశాలకన్నా ముందుండే దేశం ఏదంటే జపాన్ అని టక్కున చెప్పవచ్చు. అలాంటి దేశానికి సంబంధించిన ఆటోమొబైల్ సంస్థలు, ప్రపంచంలో అగ్రగామి ఆటోమొబైల్ సంస్థలుగా పేరొందిన టయోటా మోటార్స్, హోండా మోటార్స్ సంస్థలు తమ టెక్నాలజీ మీదున్న అపారమైన నమ్మకంతో (ఓవర్ కాన్ఫిడెన్స్)తో సరిగా పరీక్షించకుండానే కార్లను మార్కెట్ లోకి విడుదల చెయ్యడంతో అవి కాస్త వినియోగదారుడి ప్రాణాల మీదకి వస్తున్నాయి. టయోటా ఇప్పటికే 20 లక్షలకు పైగా వాహనాలను ఆగ్జిలేటర్, డోర్ స్విచ్ లో వున్న లోపం వల్ల రీ-కాల్ కు పిలుపునివ్వగా మరో సంస్థ హోండా కూడా కార్లలో ప్రమాదం సంభవించే సమయంలో కాపాడాల్సిన ఎయిర్ బ్యాగులు సరిగా పనిచేయక వాహనదారుడి ప్రాణాలమీదికి రావడంతో 4,40,000 కార్ల రీ-కాల్ కు పిలుపునిచ్చింది.
ముఖ్యంగా టయోటా మోటార్స్ వారి కార్లులో తలెత్తిన ఆగ్జిలేటర్ సమస్యల తరహా సమస్యలతో ఇప్పటి వరకూ 19 మంది మృత్యువాత పడ్డారంటే సదురు సంస్థలు వినియోగదారుడి భద్రతతో ఏ రేంజిలో ఆడుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. కార్లు కొనేప్పుడు లక్షలకు లక్షలు వసూలు చేసే సంస్థలు వారి జాగ్రత్తపై తీసుకునే చర్యలు మాత్రం గాలిలో దీపం వలే వున్నాయి. ఇప్పటికే అమెరికాలో టయోటా సంస్థ అమ్మకాలు ఘననీయంగా పడిపోయాయి. సంస్థ మీద కోర్టులో వాజ్యం కూడా నమోదయింది. ప్రభుత్వం ఇలాంటి సంస్థలపై కఠిన వైఖరిని అవలంబించాలని వారు కోరుతున్నారు...కాబట్టి వినియోగదారుడా జరభద్రం...!!