ఇటీవలే భద్రతా ప్రమాణాల దృష్ట్యా జపాన్ కు చెందిన ఆటోమొబైల్ సంస్థ టయోటా మోటార్స్ 1.8 మిలియన్ వాహనాలను వెనక్కు రప్పించిన విషయం తెలిసిందే. ఆగ్జిలేటర్ లో లోపం వల్ల ప్రమాదం సంభవించే అవాకాశాలు వుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ వర్గాలు తెలిపాయి. ఇప్పుడు జపాన్ కు చెందన మరో ఆటోమొబైల్ హోండా మోటార్స్ కూడా 6.46 లక్షల జాజ్జ్(Jazz) కార్లను వెనక్కు తీసుకువస్తోంది. కారు విండో స్విచ్ లో దొర్లిన లోపం వల్ల అగ్ని ప్రమాదం సంభవించే అవకాశాలు వుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ వర్గాలు తెలిపాయి.
ఒక్క అమెరికాలోనే 6.19 లక్షల వాహనాలను వెనక్కు తీసుకురావడానికి నిర్ణయించుకున్న హోండా మోటార్స్, ఆసియా ఖండంలోని దేశాలలో 27 వేల కార్లను వెనక్కు తీసుకురావాలని నిర్ణయించింది. ఈ రండు సంఘటనలతో జపాన్ దేశ ఆటోమొబైల్ సంస్థలు భద్రతా ప్రమాణాలను తుంగలో తొక్కుతున్నాయనే ఆలోపనలు వినిపిస్తున్నాయి.