ఇండియాలో నమ్మదగ్గ హొండా సిటి, లగ్జరీకి ప్రతిరూపమైన హొండా అకార్డ్, ముద్దు లోలికే హొండా జాజ్. ఎవరినైనా మంత్రముగ్దుల్ని చేస్ కార్లు ఇవి. ఇదే మ్యాజిక్ ను చిన్న కార్ల లోనూ ఆవిష్కరించాలనేది హొండా సియెల్ కార్స్ యత్నం. ఇది హొండాకు భారత్ లో అనుబంధసంస్ద. భారత మార్కెట్ కు అనువైన ప్రపంచ స్దాయి చిన్న కారు వచ్చే ఏడాది ద్వితీయార్దంలో అందుబాటులోకి తెస్తామని ప్రెసిడెంట్(మార్కెటింగ్) జ్ఞానేశ్వర్ చెబుతున్నారు. దీన ధర రూ. 5 లక్షలలోపే ఉంటుంది. సుజికీ స్విప్ట్, వోక్స్ వాగన్ పోలో, స్కోడా ఫ్యాబియా, ఫియట్ గ్రాండ్ ఉంట్ శ్రేణి వాహనం అని అర్దం చేసుకోవచ్చు. ఈ చిన్నకారును జపాన్ లో డిజైన్ చేసి, భారత్ లో తయారు చేసి ప్రపంచ మార్కట్ కి అందించబోతున్నాం. ఇదోచ్చాక మార్కెట్ లో ఇదోక బ్రాండ్ గా నిలుస్తుంది.
ఈ కారుకోసం ప్రత్యేకంగా ఎంత కేటాయించింది చెప్పలేను కానీ భారత్ లో ఇప్పటివరకు హొండా సియెల్ కార్స్ ఇండియా రూ.2,500 కోట్లు పెట్టుబడిగా పెట్టింది. కోత్తగా మరో రూ.250 కోట్లను రాజస్దాన్ ప్లాంట్లో ఇంజిన్ల తయారీకి సామర్ద్యాన్ని పెంచుకోవడానికి వెచ్చిస్తున్నాం. భారత్ లో మేం విక్రయించే కార్లలో హొండా సిటిదే 75 శాతం వాటా. హొండా సివిక్ కారును విడుదల విక్రయాలు ఇటీవల కాలంలో పెరుగుతున్నాయి. అయితే వచ్చే ఏడాది చివర్లో చిన్నకారును విడుదల చేసిన తర్వాత ఈ పరిస్దితి మారుతుందని అనుకుంటున్నాం అని ఆయన వెల్లడించారు.