ఇండియా ఆటోమొబైల్స్ రంగంలో మారుతి సుజుకి తర్వాత రెండవ స్దానంలో ఉన్న కార్ల కంపెనీ ఏది అంటే ఠక్కున వచ్చే సమాదానం హుండై. అంతేకాకుండా ఇండియన్ మార్కెట్ లోఓ ప్రత్యేకమైన స్దానాన్ని సంపాదించుకుంది హుండై. 1998లో హుండై సాంత్రోతో ఇండియాలోకి ప్రవేశించినటువంటి హుండై త్వరలో 2మిలియన్త్ యూనిట్ కారుని డెలివరీ చేసి ఓఅరుదైన రికార్డుని నెలకోల్పనుంది. ఈసందర్బంలో హుండై యమ్ డి, సిఇవో మాట్లాడుతూ ఈపండుగను మేము అందరం ఎంతో బ్రహ్మాండంగా నిర్వహించదలచుకున్నాం. అంతేకాకుండా ఈరోజుని రెడ్ లెటర్ డేగా హుండై చరిత్రలో ప్రకటించనున్నాం. రాబోయే కాలంలో కూడా హుండై యొక్క బ్రాండ్ ఇమేజిని కస్టమర్స్ లోఏమాత్రం విశ్వాసం తగ్గకుండా ముందుకు తీసుకోని వెళతామని అన్నారు.
ఒక సంవత్సరానికి ముందు 2.5మిలియన్ యూనిట్లును పాస్టుగా తయారుచేయడమే కాకుండా కస్టమర్స్ కుడెలివరీ చేసిన ఘనతను కూడా చాటుకుంది. ఈరికార్డుని అటు జాతీయంగా, అంతర్జాతీయంగా ఉన్న మార్కెట్ లలో నెలకోల్పిన విషయం తెలిసిందే. హుండై బ్రాండ్ రెంజ్ కార్లు అయినటువంటి సాంత్రో, ఐ10, ఐ20 లు A2 సెగ్మెంట్ లుకాగా, యాసెంట్, వెర్ణా కార్లు A3 సెగ్మెంట్ లుకాగా, సోనాటా కార్లు A5 సెగ్మెంట్ లోకి హుండై అభివృద్దికు దోహదపడుతున్నాయి.