'హుందాయ్' కథ అడ్డం తిరిగింది..!

గత నెలలో హుందాయ్ మోటార్స్ మొత్తంగా 2,50,995 వాహనాలను అమ్మగలిగింది. గత ఏడాది ఫిబ్రవరితో పోల్చితే ఇది 23 శాతం ఎక్కువ. ఇక హుందాయ్ పాచిక పారకపోవడానికి టయోటా ప్రకటించిన ఇన్సెంటివ్సే ప్రధాన కారణం అని తెలిసింది. ఈ ఇన్సెంటివ్స్ ప్రకటించడం ద్వారా వినియోగదారున్ని ఆకర్షించాలనే టయోటా ఎత్తుగడ పారడంతో రీకాల్ తో విమర్శల పాలయినప్పటికీ అనూహ్యంగా టయోటా అమ్మకాలు పెరిగాయి. దీంతో సందట్లో సడేమియా అని అమ్మకాలను పెంచుకోవాలనుకున్న హుందాయ్ పాచిక పారలేదు.. డామిట్ కథ అడ్డం తిరిగింది..!!


Click it and Unblock the Notifications








