హుండై ఫ్రీగా కార్ కేర్ క్లినిక్..!

ఈ ఫ్రీ కార్ కేర్ చెకప్ లో ఇంజను ట్రాన్సిమిషన్, ఎలక్ట్రికల్ సిస్టమ్, అండర్-బాడి, ఎసి, ఎక్స్ టీరియర్ మొదలగువాటిని చెకప్ చేయడం జరుగుతుందన్నారు. వీటితో పాటు ఇండియాలో ఉన్న అందరూ హుండై కస్టమర్స్ కోసం కారుని ఫ్రీగా వాష్ చేయడం మరియు ఆయిల్ మార్పిడికి సంబంధించిన విషయాలలో 10శాతం వరకు డిస్కౌంట్, స్పేర్ పార్ట్స్ మరియు సెలెక్టెడ్ యాససరీస్ కి సంబంధించి 20శాతం వరకు డిస్కౌంట్ లుప్రకటిస్తున్నామన్నారు. ఇక ఈవెంట్ ని స్పాన్సర్ చేస్తున్నటువంటి షెల్ స్కాట్ కార్డుని ఆఫర్ చేస్తున్నారు, ఈ కార్డు వల్ల కస్టమర్స్ 20శాతం వరకు డిస్కౌంట్ పోందవచ్చు.
ఈ వారం రోజులు పాటు జరగనున్న ఈవెంట్ లో కస్టమర్స్ కు ఎగ్జైంటింగ్ కలిగించడానికి ప్రతిరోజు లక్కిడిప్ ద్వారా ఎన్నకైన కస్టమర్స్ కు గిప్ట్స్ మరియు ప్రైజెస్ ఉంటాయన్నారు. ఇలా రోజుకి ప్రతి రోజు వారంటీ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇలా పదిరోజులు జరగనున్న ఈవెంట్ లో100వారంటీలను ఇవ్వడం జరుగుతుందన్నారు. మనదేశంలో ఉన్న ఎనిమిది రీజియన్లలలో ఈ ప్రైజ్ లుఇవ్వడం జరుగుతుందని, ప్రధయ విజేతకు 32ఇంచ్ ఎల్ సిడి టివి ద్వితీయ విజేతకు డిజిటల్ కెమెరా మరియు తృతియ విజేతకు డివిడి ప్లేయర్ ఇవ్వడం జరుగుతుందన్నారు. దీనితోపాటుగా ఓ లక్కీ విన్నర్ కు బంపర్ ప్రైజ్ క్రింద 32ఇంచ్ ఎల్ సిడి టివి తోపాటు ఒక డివిడి ప్లేయర్ అందివ్వడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే సమయంలో డైరెక్టర్ అరవింద్ సక్సేనా (మార్కెటింగ్ మరియు సేల్స్) మాట్లాడుతూ కస్టమర్స్ కు హుండై కంపెనీ ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఈ ఫ్రీ కార్ కేర్ సర్వీస్ ద్వారా మా కంపెనీ యొక్క ఉన్నత ప్రమాణాలను మరోసారి చాటుతున్నామన్నారు. గతంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినప్పుడు కస్టమర్స్ నుండి మంచి స్పందన వచ్చిందన్నారు. ప్రస్తుతం మేము నిర్వహిస్తున్నటువంటి ఈ తోమ్మిదవ క్యాంపు కూడా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నామన్నారు.


Click it and Unblock the Notifications








