ప్రపంచ అతి పెద్ద ఆటోమొబైల్ సంస్థల్లో ఒకటిగా విరాజిల్లుతున్న హుందాయ్ మోటార్స్ ఈ ఏడాది యుకెలో కార్ మేకర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సాధించింది. బ్రిటీష్ ఆటోమేటివ్ మేనేజ్ మెంట్ వారు ప్రకటించిన ఈ అవార్డుల్లో కొరియాకు చెందిన ఆటోమొబైల్ సంస్థ హుందాయ్ మోటార్స్ ఫోర్డ్ మరియు జాగూర్ ల్యాండ్ రోవర్ సంస్థల నుండీ గట్టి పోటీ ఎదురయినా వాటిని అధికమించి ఈ ఘనతను సాధించింది.
గత ఏడాదితో పోల్చితే రెండింతలయిన హుందాయ్ సంస్థ కార్ల అమ్మకాలు ఈ ఘనతను సంపాదించడానికి దోహదం చేసాయి. i-సీరీస్ కార్లు రికార్డు స్థాయిలో అమ్మకాలను రాబట్టడంతో హుందాయ్ ఈ ఏటి ఉత్తమ కార్ల తయారీ సంస్థగా ఎంపికయింది.