హుందాయ్ రూ. 2 లక్షల కారు

కొరియాలోని హుందాయ్ బృందం ఈ కారు కోసం పనిచేస్తున్నారట. అందరికీ అందుబాటులో వుండేలా ఈ కారు ధరను రూ. 2 లక్షలుగా నిర్ణయించనున్నట్టు సమాచారం. కోల్ కత్తా ఎక్స్ షోరూం నందు ఈ కారు ఎసి మోడల్ ధర 2.16 లక్షలుగా వుంటుందని హుందాయ్ సంస్థ వారి సమాచారం. ఇక పోతే ప్రస్తుతం భరతీయ మార్కెట్ ను చిన్నకార్లు శాసిస్తున్నాయి. ఇటీవలే విడుదలయిన ఫోర్డ్ సంస్థ చిన్న కారు ఫిగో మంచి స్పందనను పొందుతోంది. ఇక నిస్సాన్-రినాల్ట్ సంస్థలు కూడా బజాజ్ ఆటో సాయంతో ఓ అల్ట్రా చిన్నకారును రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ కారు ధర నానో కారు కన్నా తక్కువగా వుండనుందని సమాచారం.


Click it and Unblock the Notifications








