మారుతి ఆల్టో పోటీకి హుందై కంపెనీ చిన్నకారు తయారికి సన్నాహాలు..!

హుందై ప్రస్తుతం డొమెస్టక్ మార్కెట్ లో 20.6శాతం మార్కెట్ షేర్ ని సోంతం చేసుకుందని, త్వరలో అది డబుల్ అవ్వడానికి ప్రయత్నస్తున్నామన్నారు. అంతేకాకుండా వచ్చే నెలలో హుందై కొత్తగా స్పోర్ట్ యుటిలిటి వాహానం సాంతా ఫీ ని మార్కెట్ లోకి విడుదల చేస్తున్నామన్నారు.
వీటితో పాటు త్వరలో హుందై సాంత్రో కంటే తక్కువగా ఉంటే చిన్నకారుకి సన్నాహాలు ప్రారంభించిదన్నారు. ఈ చిన్న కారు ప్రోజేక్ట్ కోరియాలో డెవలప్ చేయడానికి నిర్ణయం తీసుకున్నామన్నారు. మారుతి లో బాగా సక్సేస్ అయినటువంటి మారుతి ఆల్టో కి పోటీగా ఈ చిన్నకారు వస్తుందని తెలిపారు. మా అంచనా ప్రకారం నెలకి 20,000 యూనిట్స్ ను అమ్మగలం అని అనుకుంటున్నాము అని అన్నారు.
హుందైకి శ్రీపెరుంబుదూర్ లో రెండు మానిప్యాక్చరింగ్ యూనిట్లు ఉన్నాయన్నారు. మిడ్ సెగ్మెంట్ నుంచి సాంత్రో, ఐ10, ఐ20 ని మరియు సీడాన్ సెగ్మెంట్ నుండి యాసెంట్, వెర్నా, సోనాటా సీడాన్ తయారు చేస్తున్నామన్నారు. అంతేకాకుండా హుందై గెట్జ్ ఉత్పత్తిని ప్రస్తుతానికి నిలపివేస్తున్నామని అన్నారు. దానికి కారణం సేల్స్ తక్కువగా ఉండడమే అని అన్నారు. హుందై కంపెనీ తన కార్లను 110దేశాలకు ఎగుమతి చేస్తుందని అన్నారు.


Click it and Unblock the Notifications








