కోరియన్ గ్రాండ్ ఫ్రిక్స్ పై డ్రైవ్ చేసిన కరున్ చాంద్ హాక్...!

వాటితో పాటు అక్కడ ఉన్న ఫేసిలిటీస్, గ్యారెజీలతో పాటు బిల్డింగ్సు కూడా తనని బాగా ఆకట్టుకున్నాయని అన్నారు. గ్రాండ్ స్టాండ్స్ కూడా చూడడానికి సామాన్యంగా ఉన్నాయని, ఫినిషింగ్ కూడా చాలా అధ్బుతంగా ఉందని వెల్లడించారు. సముద్రానికి దగ్గర్లో చాలా అందంగా ఈ ఏరియాని తీర్చిదిద్దారని అన్నరు. ఈ కోరియన్ గ్రాండ్ ఫ్రిక్స్ త్వరలోనే ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నామని అక్కడ వున్న యాజమాన్యం వివరించారు. ప్రస్తుతం గ్రాండ్ స్టాండ్స్ ని పనిచేస్తున్నామని, వాటితో పాటు ముందు ప్రవేశమార్గం కూడా కోంత పని ఉండడం వల్ల ఆ పనిని పూర్తిచేస్తున్నామని వివరించారు. ప్రస్తుతానికి చాలిచాలని పార్కింగ్, అలాగే వాటర్ సప్లై కూడా ఇబ్బందిగా ఉందని ఈ మొత్తం పనిని ఈవెంట్ మొదలుపెట్టబోయే సమయంలో కెల్లా పూర్తి చేస్తామని సిఇవో యంగ్ చూ చూంగ్ వెల్లడించారు. త్వరలో ఇక్కడ మీరు ఒక చారిత్రాత్మక ఘట్టాన్నిచూడబోతారని ఆయన వెల్లడించారు.


Click it and Unblock the Notifications








