ముంబయి: మహింద్రా & మహింద్రా వచ్చే రెండేళ్ళలో ద్విచక్ర వాహనాల వ్యాపారాన్ని రెట్టింపు చేయాలనుకుంటోంది. ఈ కంపెనీ 2008లో కైనెటిక్ మోటార్ వ్యాపారంలోకి వచ్చింది. ఇప్పుడు 125 సిసి మూడు స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేసింది. తమకు మార్కెట్ ఆశాజనకంగా ఉందని మహీంద్ర అండ్ మహీంద్ర టూ వీలర్ సెక్టార్ ప్రెసిండెంట్ అనూప్ మాధుర్ ముంబయిలో చెప్పారు.
ఈ కంపెనీ తయారు చేస్తున్న రోడియో మగవాళ్ళను ఉద్దేశించినది. డ్యూరో ఫ్యామిలీ టైప్. ఫ్లైట్ మాత్రం మగువలకు. ఈ కంపెనీ 70, 008 యూనిట్లను తయారు చేసింది. ప్రారంభించిన నాలుగు నెలలకే 10 వేల యూనిట్లు అమ్మామని, తమకు మార్కెట్ ఆశాజకంగా ఉందని మాధుర్ చెప్పారు.