ఇన్నాళ్లు మినీ ట్రక్ విభాగంలో తిరుగులేని మహారాజు గా ఏలిన టాటా మోటార్స్ ఏస్ కు గట్టి పోటీ ఇవ్వడానికి మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ సరికొత్త మినీ ట్రక్కు మ్యాగ్జిమోను విపణిలోకి ప్రవేశపెట్టింది. డి.ఓ.హెచ్.సీ టెక్నాలజీతో కూడిన 2-సిలిండర్ల సీ.ఆర్.డి.ఇ. ఇంజన్, 25 హార్స పవర్ సామర్థ్యంతో మెరుగైన పికప్, యాక్సిలరేషన్ ఇచ్చేలా 5.5 కేజీఎమ్ టార్క్, 850 కేజీల పేలోడ్, 3.2 మీటర్ల లోడింగ్ ఏరియా లాంటి ప్రత్యేకతలతో రూపొందిన ఈ మినీ ట్రక్కు లీటరుకు 20 కిమీ మైలేజీని ఇస్తుంది.
2.79 లక్షల రూపాయల్లో లభ్యమయ్యే ఈ ట్రక్కు మొత్తం నాలుగు రంగుల్లో లభ్యం అవుతుంది. కాగా ఈ ట్రక్కును ముందుగా దేశంలోని పశ్చిమ, ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో విడుదల చేసి, ఆ తర్వాత దశల వారీగా మిగితా ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్టు సిఇఓ రాజేష్ జెజూరికర్ తెలిపారు.