దక్షిణ కొరియాకు చెందిన శాంగ్ యాంగ్ మోటార్ (యస్ ఎమ్)కంపేనీని హస్తగతం చేసుకోవడానికి మహీంద్రా & మహీంద్రా మరో అడుగు ముందుకి వేసింది. శాంగ్ యాంగ్ తో ఎంఓయూ కుదుర్చుకున్నట్లు ఎమ్ అండ్ ఎమ్ తెలిపింది. త్వరలో డ్యూ డిలిజెన్స్ ప్రక్రియ ప్రారంభిస్తామని, నిర్దిష్టమైన ఒప్పందాలకు తుది రూపునిస్తామని తెలిపింది. 64 కోట్ల డాలర్ల రుణ భారం ఉన్న ఈ కంపెనీ కోనుగోలు కోసం ఎంత పెట్టుబడి పెడుతున్నామన్నది ఎమ్ అండ్ ఎమ్ వివరించలేదు. భారత్ లో నానాటికీ గిరాకీ పెరుగుతున్న స్పోర్ట్స్ యుటిలిటీ వాహన విభాగంలో శాంగ్ యాంగ్ కి సరికోత్త అవకాశాలు ఏర్పడవచ్చు అని వ్యవసాయ పరికరాల విభాగం అధ్యక్షుడు పవన్ గోయెంకా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు శాంగ్ యాంగ్ మోటార్ తో ఓ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు బొంబాయి స్టాక్ ఎక్షైంజీ(బీ ఎస్ ఈ)కి తెలిపింది.
రెండు కంపెనీల బ్రాండ్లు సయోధ్య, సమన్వయంతో ముందుకి సాగుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. శాంగ్ యాంగ్ మోటార్ కొనుగోలుకి ఈ నెల 12న జరిగిన బిడ్డింగ్ లో ప్రధమ బిడ్డర్ గా ఎంపికైన సంగతి తెలిసిందే.