టూవీలర్స్ రంగంలోకి అడుగుపెట్టనున్న మహీంద్ర అండ్ మహీంద్ర..!

దీనికి గాను ఎవరైనా మహీంద్ర కంపెనీ తయారుచేసినటువంటి బైక్స్ ని రైడ్ చేయాలనుకునే వారు పాస్ పోర్టు సైజ్ ఫోటోతో వారికి సంబంధించిన రెజ్యూమ్ ను ఇండియాబైకర్స్. కామ్ లోకి అప్ లోడ్ చేయమని చెప్పడం జరిగింది. ఇలా అప్ లోడ్ చేసినటువంటి మొదటి 20మందికి మొత్తం భారతదేశం బైక్ పై రైడ్ చేసే అవకాశం కల్పిస్తామన్నారు. దీనికి సంబంధించి ప్రత్యేకమైన ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుందని వారు వివరించారు. అంతేకాకుండా భారతదేశం మొత్తం తిరిగిన తర్వాత ఆ బైక్ ని వారికే సోంతం చేయడం జరుగుతుందని అన్నారు. ఇదోక కొత్త లాంచింగ్ తోపాటు, మాస్ పీపుల్ కు ఇలా ఐతే బాగా దగ్గరవ్వుతామని అన్నారు. దీనిని నాలుగు భాగాలుగా విభజించడం జరిగిందన్నారు. ఈస్ట్ వైపున లడక్, నార్త్ వైపు గౌహాతి, సౌత్ వైపున కన్యాకుమారి, వెస్ట్ వైపున ముంబయి నుండి విన్నర్స్ వారి యొక్క బైక్ యాత్ర ని ప్రారంభిస్తారని అన్నారు. ఈ మహీంద్ర అండ్ మహీంద్ర కు సంబంధించిన అన్ని బైక్స్ ప్రమోషన్స్ మరియు బైక్స్ వివరములు అన్ని ఇండియాబైకర్స్. కామ్ సైట్ లో పోందుపరుస్తామని వివరించారు.


Click it and Unblock the Notifications








