సరకుల రవాణా రూపోందంచిన మినీ ట్రక్ మాగ్జిమోను తయారుచేసిన మహింద్రా & మహింద్రా గురువారం రాష్ట్ర మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దేశంలో ఉత్తర, పశ్చిమ, ఈశాన్య రాష్ట్రాలతో పాటు దక్షిణాన కర్ణాటక, కేరళలో ఇప్పటికే ఈ వాహనాలను విక్రయిస్తున్నట్లు, 26శాతం మార్కెట్ వాటా సాధించినట్లు ఎం & ఎం వాహన విభాగం సీనియర్ ఉపాధ్యక్షులు(విక్రయాలు,ఖాతాదారు సేవలు)అరుణ్ మల్హోత్రా చెప్పారు. 2009లో దేశంలో 1,27,000 మినీ ట్రక్కులు విక్రయాలు జరిగాయని, అందులో 40 శాతం వాటా దక్షిణాది రాష్ట్రాలదేనని ఆయన చెప్పారు. నెలకు మూడు వేల వాహనాలు తయారు చేసేలా పూణె లో ప్లాంటును రూ. 350 కోట్లతో ఏర్పాటు చేశామని ఎం & ఎం వాహన విభాగం ముఖ్యకార్యనిర్వహణాధికారి (సిఈఓ)రాజేష్ చెప్పారు.
ఈ వాహనంలో కార్లకు వినియోగించే 2 సిలెండర్లు సీఆర్ డీఈ ఇంజిన్ ను తొలిసారిగా ఈ వాహనానికి అమర్చామని, క్యాబిన్ లో సీట్లు, డ్యాష్ బోర్డు ప్యానల్ ఆధునికంగా రూపోందిచడంతోపాటు మొబైల్ చార్జర్ కూడా వుంటుంది. 25 హార్స పవర్ శక్తితో గంటకు 70 కిలోమీటర్ల అత్యధిక వేగం అందుకుంటుంది. 20 కిలోమీటర్ల మైలేజి ఇస్తుంది. 850 కిలోల బరువు మోసుకెళ్లేలా 35 చదరపు అడుగుల స్థలం ఉంటుందని, తోలి ఏడాదిలో 40,000 కిలోమీటర్ల మేర ఉచిత సర్వీసింగ్ ను కంపెనీ అందిస్తుందని ఆయన అన్నారు.