భారతదేశ అతిపెద్ద చిన్న కార్ల సంస్థ మారుతీ సుజుకీ మరో ప్రతిష్టాత్మక సంస్థ టాటా మోటార్స్ వారి చిన్న కారు నానోకు పోటీగా రూపొందించిన చిన్న కారు 'సెర్వో'. ఈ చిన్న కారును జూన్ నెలలో భారతీయ విపణిలోకి ప్రవేశపెట్టనున్నట్టు మారుతీ సుజుకి సంస్థ వర్గాలు ప్రకటించాయి. నానోకు గట్టిపోటీ ఇవ్వడంతో పాటు మారుతీ సుజుకి చిన్న కారు మారుతీ 800 కారు లోటును భర్తీ చెయ్యాలని సంస్థ ప్రయత్నిస్తోంది. మారుతీ సుజుకి 2012వ సంవత్సరం నుండీ బహుళజనాదరణ పొందిన మారుతీ 800 కార్ల ఉత్పాదనను నిలిపివేయాలనుకుంటున్న విషయం తెలిసిందే.
ఇక 0.7 లీటర్, 660 సిసి పెట్రోల్ ఇంజన్ తో రూపొందిన ఈ కారు ధర 1.5 లక్షల నుండీ 2 లక్షల మధ్యన వుంటుందని సంస్థ వర్గాలు తెలిపాయి. ఇక పోతే ఈ కారు టాటా మోటార్స్ వారి నానో కారు కంటే కొద్దిగా ఎక్కువే అయినా రతన్ టాటా బుల్లికారుకు గట్టి పోటీ ఇస్తుంది అనడంలో సందేహం లేదంటున్నారు పరిశీలకులు..!!