భారతదేశ అతిపెద్ద చిన్న కార్ల సంస్థ మారుతీ సుజుకీ రూపొందించిన చిన్న కారు 'సెర్వో'ను త్వరలో ఇక్కడి విపణిలోకి ప్రవేశపెట్టనున్నట్టు సంస్థ వర్గాలు ప్రకటించాయి. ఈ కారును ఈ ఏడాది మే లేదా జూన్ మాసాల్లో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తోంది మారుతీ సుజుకి. 2012వ సంవత్సరం నుండీ బహుళజనాదరణ పొందిన మారుతీ 800 కార్ల ఉత్పాదనను నిలిపివేయాలనుకుంటున్న మారుతీ సుజుకి ఈ సెర్వో కారుతో మారుతీ-800 లోటును భర్తీ చెయ్యాలని భావిస్తోంది.
0.7 లీటర్, 660 సిసి పెట్రోల్ ఇంజన్ తో రూపొందిన ఈ కారు ధర 1.5 లక్షల నుండీ 2 లక్షల మధ్యన వుంటుందని సంస్థ వర్గాలు తెలిపాయి. ఇక పోతే ఈ కారు టాటా మోటార్స్ వారి నానో కారు కంటే కొద్దిగా ఎక్కువే అయినా రతన్ టాటా బుల్లికారుకు గట్టి పోటీ ఇస్తుంది అనడంలో సందేహం లేదంటున్నారు పరిశీలకులు..!!