33.99 శాతం రికార్డు స్థాయి అభివృధ్ధిని సాధించాం..!

గత నెలలో ఇండియా మార్కెట్ లో మారుతి 92,674 కార్లను అమ్మడం జరిగినది. ఐతే ఊహించని విధంగా మారుతి 800 సేల్స్ మాత్రం 2010లో 1,919కి పడిపోయాయి, దానికి కారణం మారుతి 800 ఇంజనుని BSIV ప్రమాణాలకు పంపోందించకపోవడమే. మారుతి కంపెనిలో A2 సెగ్మేంట్ నుండి సేల్స్ ఎక్కువగా జరుగుతాయి. ఆగస్టు 2009లో 52,473 యూనిట్స్ అమ్మగా, 2010 ఆగస్టులో 65,953 యూనిట్స్ ను అమ్మడం జరిగింది. దీనికి గాను మారుతి కంపెని 25.69 శాతం అభివృధ్ధిని సాదించింది. ఇక A3 సెగ్మేంట్ లో పోల్చుకున్నట్లతే 7,821యూనిట్స్ కి గాను 10,479 యూనిట్స్ ని అమ్మి 33.99 శాతం రికార్డు స్థాయి అభివృధ్ధిని సాదించింది.


Click it and Unblock the Notifications








