మారతీ సెర్వో విశేషాలు

ఈ సెర్వో కారు 54bhp, 660 సిసి ఇంజన్ తో రూపొందింది. నానోలా కాకుండా ఈ కారు పూర్తిగా హ్యాచ్ బ్యాక్ లుక్ తో రూపొందింది. ఎంతో హుందా అయిన లుక్స్ తో రూపొందిన ఈ కారు బేసిక్ మోడళ్లలో పవర్ స్టీరింగ్ మరియు ఎసి వంటి సౌకర్యాలు అందుబాటులో వుంటాయి. ఇక హైవెర్షన్ కార్లలో అన్ని భద్రతా సౌకర్యాలతో ఈ కారు రూపొందింది. ఇందులో ఎయిర్ బ్యాగ్, సేఫ్టీ బెల్ట్ వంటి సౌకర్యాలు వుంటాయి. ఇక వీటితో పాటు సెమీ బకెట్ సీట్లు, ఇంజన్ విత్ బ్లూటూత్ ఫెసిలిటీ తో పాటు 5 స్పీడ్ ఆటో గేర్ బాక్స్, 30 లీటర్ల సామర్థ్యం గల ఇంధన ట్యాక్ వంటి అధనపు సౌకర్యాలు వున్నాయి. ఇంకా ధరను నిర్ణయించిన ఈ కారు ధర 1.5 లక్షల నుండీ 2 లక్షల మధ్యలో వుంటుందని సమాచారం.


Click it and Unblock the Notifications








