2.59 లక్షల మల్టీ పర్పస్ కారు మారుతీ ఈకో విడుదల..!!

భారతీయ మార్కెట్ ను లక్ష్యంగా చేసుకొని రూపొందించిన ఈ కారుని భారతీయ మారుతీ సుజుకీ ఇంజనీర్ల బృందం రూపొందించినది. పారిశ్రామిక నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ కారు సి-సెగ్మెంట్ క్రిందకు వస్తుంది. ఈ మల్టీ పర్పస్ కారు ధరను 2.59 నుండీ 2.89 లక్షల మధ్యలో ఉంటుందని, మా ఇంజనీర్ల శ్రమ ఫలితమే ఈ కారుని, ఇది ఖచ్చితంగా భారతీయ ప్రమాణికాలను పెంచేదిగా వుంటుందని భారతీయ మారుతీ సుజుకీ యండి, సిఈవో షింజో నకనిషి అభిప్రాయపడ్డారు.
ఈ కారుకి ఎలక్ట్రిక్ వెర్షన్ ఇకో ఛార్జ్ ను ప్రస్తుతం తమ ఇంజనీర్లు రూపొందిస్తున్నారని, ఈ ఎలక్ట్రిక్ వెర్షన్ ను కామన్ వెల్త్ గేమ్స్ లో ప్రదర్శించనున్నామని కూడా ఆయన ప్రకటించారు.


Click it and Unblock the Notifications








